సినిమా ఇండస్ట్రీ లో ఓ కాంబో లో మూవీ అనుకోవడం , కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సల్ కావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరో గా త్రిష హీరోయిన్గా కృష్ణ అనే మూవీ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ , త్రిష మధ్య కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి.

ఇకపోతే వీరి కాంబో లో కృష్ణ సినిమా కంటే ముందే ఓ మూవీ రావాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందట. ఇక ఆ సినిమా ఏకంగా ఇంట్రెస్ట్ హిట్ కూడా అయ్యిందట. మరి ఇంతకు రవితేజ , త్రిష కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా ..? ఆ సినిమా మరేదో కాదు పోకిరి. అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ "పోకిరి" సినిమా కథను రెడీ చేసుకున్న తర్వాత అందులో రవితేజ ను హీరో గా త్రిష ను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ ఇద్దరికి కథను కూడా వివరించగా వారు కూడా ఓకే అన్నారట.

ఇక ఆల్మోస్ట్ అంతా ఓకే అయింది ... సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు రవితేజ వేరే మూవీ కి కమిట్ కావడంతో ఆ మూవీ ని అక్కడే ఆపేసారట. ఆ తర్వాత కొంత కాలానికి మహేష్ బాబు హీరో గా ఇలియానా హీరోయిన్గా పోకిరి మూవీ ని రూపొందించగా ... ఆ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. అలా కృష్ణ సినిమా కంటే ముందే రవితేజ , త్రిష కాంబోలో ఓ సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt