మన దేశంలో సినిమా స్టార్లకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. తమ హీరోల పుట్టినరోజు అయితే చాలు ఎన్నో సేవా కార్యక్రమాలు, భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు వంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే తమ అభిమాన హీరో విడుదలవుతోంది అంటే చాలు సెలవు కోసం ప్రత్యేకించి మరి  కంపెనీలకు సెలవు కోసం లేఖలను రాస్తూ ఉంటారు..అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఒక సన్నివేశం ఇప్పటివరకు కనిపించలేదు. కానీ ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో కనిపించేది.


రజనీకాంత్ తో పాటు ఇతర స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు సెలవు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. యూకే కంపెనీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు హాఫ్ డే సెలవుని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా బాలు రెడ్డి యూకే అనే వ్యక్తి పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా ఉంటూ ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.


యూకేలో ఒక ఐటీ కంపెనీ , ఈ కామర్స్ బిజినెస్ రన్ చేస్తున్నారు. అందులో పని చేసే ఉద్యోగులకు శుభవార్త తెలియజేస్తూ హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా తమ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ఇస్తున్నట్లు ఒక మెయిల్ ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్ ని కూడా తన ట్విట్టర్లో తెలిపారు బాలు రెడ్డి. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా తన రెండు కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఆఫ్ డే సెలవు ప్రకటిస్తున్నానంటూ సుమారుగా 27 మంది ఉద్యోగులలో ఎక్కువ మంది తెలుగువారు ఉండడం చేత వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ పోస్ట్ షేర్ చేశారు. ఈ విషయం పవన్ అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: