
సాధారణంగా మధ్యాహ్నం రివ్యూలు ఇచ్చే కొన్ని వెబ్ సైట్లు సైతం ఈ సినిమా కోసం తమ రూల్స్ ను మార్చుకుని అర్ధరాత్రి సమయంలో నెగిటివ్ రివ్యూలను పబ్లిష్ చేయడం గమనార్హం. పొలిటికల్ గా సక్సెస్ సాధించిన పవన్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే లక్ష్యంగా హరిహర వీరమల్లు విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని తెలుస్తోంది. పవన్ అంటే ఇంత పగేంటి అని టాలీవుడ్ సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి వ్యక్తులు, వెబ్ సైట్ల వల్లే సినిమా రివ్యూలను ఆలస్యంగా పబ్లిష్ చేయాలనే చర్చ సైతం తెరపైకి వస్తుండటం గమనార్హం. పవన్ మార్కెట్ ను దెబ్బ తీయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి. పవన్ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి టికెట్ రేట్ల విషయంలో అన్యాయం జరగగా బ్రో సినిమాకు సైతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. పవన్ సినిమాల విషయంలో ప్రతి సందర్భంలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కాగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి టాక్ రావడంతో ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే లేదు. హరిహర వీరమల్లు మూవీ స్టోరీ లైన్ అద్భుతంగా ఉన్న సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతుంది. కథనంలో తప్పులు ఈ సినిమా పాలిట శాపంగా మారాయి. హరిహర వీరమల్లు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.