
బద్రిస్వామి కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్స కోసం ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు కానుందని తెలుస్తోంది. చికిత్స కోసం ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా ఆర్ధిక సమస్యల వల్ల బద్రీనాథ్ కు చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్ ఈ విషయాలను బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు.
బాలయ్య ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే మంచి మనసుతో స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించడం గమనార్హం. బాలయ్య భార్య వసుంధర ఇందుకు సంబంధించిన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ విషయంలో బాలయ్యను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ2 సినిమాలో నటిస్తుండగా సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో, క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య భవిష్యత్తు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నందమూరి బాలకృష్ణ రేంజ్ అంతకంతకు పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సైతం ఆనందాన్ని కలిగిస్తోంది.