
నేను ఇప్పుడు చెబుతున్నానని ఏడాది నుంచి కింగ్డమ్ గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తోందని తిరుపతి వెంకన్న సామి ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపిస్తే చాలా పెద్దోడ్ని అవుతానని పోయి టాప్ లో కూర్చుంటానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ తిరుపతిలో సీమ యాసలో మాట్లాడటానికి ప్రయత్నించడం గమనార్హం. ఈసారి తనకు పెద్దగా టెన్షన్ లేదని విజయ్ దేవరకొండ అన్నారు.
అయితే పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించడం సాధ్యం కాదు. విజయ్ దేవరకొండపై ఒక వర్గం అభిమానుల్లో నెగిటివిటీ ఉందని కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. వాస్తవానికి కింగ్డమ్ సినిమాపై మరీ భారీ స్థాయిలోఅంచనాలు అయితే లేవు. విజయ్ దేవరకొండ పారితోషికం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు