మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మల్లిడి వసిష్ఠ తెర‌కెక్కిస్తున్న సోసియో-ఫాంటసీ ఫిల్మ్ `విశ్వంభ‌ర‌`. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో చెన్నై సోయ‌గం త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. కీర‌వాణి సంగీతం అందించారు. విశ్వంభ‌ర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెష‌ల్ సాంగ్ ను కూడా రెండు రోజుల క్రిత‌మే ముగించారు.


భీమ్స్ సిసిరోలియో స్వ‌ర‌ప‌రిచిన విశ్వంభ‌ర స్పెషల్ సాంగ్ లో నాగిని భామ మౌని రాయ్ చిరంజీవికి క‌లిసి స్టెప్పులు వేసింది. గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నిజానికి ఈ సాంగ్ కోసం మేక‌ర్స్ చాలా మంది హీరోయిన్స్ ను ప‌రిశీలించారు. బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ ను సంప్ర‌దించ‌గా.. ఆమె రూ. 8 కోట్లు డిమాండ్ చేసింది. దాంతో వెన‌క్కి త‌గ్గిన విశ్వంభర మేక‌ర్స్‌.. ఫైన‌ల్ గా మౌనీ రాయ్‌ను ఎంపిక చేశారు.


తెలుగులో మౌనీ రాయ్ చేస్తున్న తొలి చిత్ర‌మిదే. అయితే నాలుగు నుంచి ఐదు నిమిషాలు నిడివి గ‌ల విశ్వంభ‌ర‌ స్పెష‌ల్ సాంగ్ కు నాగిని భామ రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేసింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, శ్రీ‌లీల‌, త‌మ‌న్నా, పూజా హెగ్డే వంటి తార‌లు ఒక్కో ఐటెం సాంగ్‌కు కోట్ల‌లో పారితోషికం అందుకుంటున్నారు. వారితో పోలిస్తే మౌనీ రాయ్ రీజ‌న‌బుల్‌గానే ఛార్జ్ చేసింద‌ని చెప్పొచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: