
త్త సినిమా రాకతో థియేటర్ల లభ్యత, ప్రేక్షకుల దృష్టి మళ్లడం వంటి కారణాలు "హరిహర వీరమల్లు"కు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో నిర్మాత తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు కనీసం జీఎస్టీ అయినా వెనక్కు ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
సినిమా కథ, కథనం బలంగా లేవని, చాలా సన్నివేశాలు పేలవంగా ఉన్నాయని విమర్శకులు, ప్రేక్షకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో సినిమా పట్టు కోల్పోయిందని, అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. "హరిహర వీరమల్లు"లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, అవి సినిమా చూసే అనుభూతిని తీవ్రంగా దెబ్బతీశాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కొన్ని చోట్ల అవి కార్టూన్ గ్రాఫిక్స్ లాగా ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి.
"హరిహర వీరమల్లు" భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా. కానీ, సినిమా చూశాక ఆ బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ, గ్రాండ్‌నెస్ లేదని చాలా మంది భావించారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. సినిమా విడుదలైన తర్వాత సరైన ప్రచారం లేకపోవడం, అలాగే విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ బారిన పడటం కూడా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో అయినా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.