కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరో గా సలోని హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ మూవీ ని హిందీ లో అజయ్ దేవగన్ హీరో గా సన్నాఫ్ సర్దార్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ మూవీ ఆ సమయం లో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న తర్వాత నుండి ఈ సినిమాకి కొనసాగింపుగా సన్నాఫ్ సర్దార్ 2 రాబోతుంది అనే వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ సినిమా స్టార్ట్ కాలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా యొక్క సీక్వెల్ కొంత కాలం క్రితం ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్నాఫ్ సర్దార్ 2 సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఆ అంచనాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంలో కాస్త విఫలం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సన్నాఫ్ సర్దార్ 2 సినిమాకు మొదటి రోజు 7.5 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కగా  , రెండవ రోజు 8.25 కోట్ల నెట్ కలెక్షన్లు  దక్కాయి.

మూడవ రోజు 9 కోట్ల రేంజ్ లో ఈ సినిమాకు నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక తొలి వర్కింగ్ డే రోజు ఈ మూవీ కి కేవలం రెండు కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు 27 కోట్ల లోపే నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు వస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు లేవు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: