
వాస్తవ ఉదాహరణలు చూస్తే – షాక్ అవ్వాల్సిందే! :
* 2023లో పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా ఓపెనింగ్ జోరు తర్వాత కుదేలైంది. అదే సమయంలో వచ్చిన చిన్న సినిమా ‘బేబి’ భారీ కలెక్షన్లు సాధించింది. బ్రోకు థియేటర్లు తగ్గించి బేబికి పెంచిన పరిస్థితి!
* 2024 సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా పెద్ద అంచనాలతో వచ్చి... ‘హనుమాన్’ అనే చిన్న బడ్జెట్ సినిమా ముందు నిలవలేకపోయింది. హనుమాన్ నెల రోజుల పాటు కలెక్షన్ల తుపాను సృష్టించగా, గుంటూరు కారం రెండు వారాల్లో థియేటర్ల నుంచి డిస్‌మిస్ అయింది.
* ఈ ఏడాది ‘మహావతార నరసింహ’ అనే కన్నడ అనువాద యానిమేషన్ మూవీ, పవన్ కళ్యాణ్ **‘హరిహర వీరమల్లు’**ను చిత్తు చేసింది. వీకెండ్‌కు పరిమితమైన పవన్ సినిమా తర్వాతా, నరసింహ కలెక్షన్లే ట్రెండ్ అయ్యాయి. దాని ప్రభావం ‘కింగ్డమ్’ వంటి మరో భారీ చిత్రంపై పడడం విశేషం.
సినిమా ఆడేది కంటెంట్‌తోనే, కాంబినేషన్‌తో కాదు! .. ఈ ట్రెండ్ ఓ క్లియర్ మెసేజ్ ఇస్తోంది – స్టార్ ఉన్నంత మాత్రాన సినిమాకి సక్సెస్ గ్యారంటీ కాదు. కంటెంట్ బలంగా ఉంటే చాలు – ఆ సినిమా చిమ్మచిమ్మ మనీ వసూల్. కనీసం ఇప్పుడు అయినా నిర్మాతలు గ్లామర్ కాంబినేషన్ల కన్నా కథపై ఫోకస్ పెడితే... ఇండస్ట్రీకి నిజమైన గేమ్ చేంజ్ అవుతుంది.