
అయితే ఇందుకు కారణం మహేష్ బాబు హీరోగా నటించిన `గుంటూరు కారం` మూవీనే అనే టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా మొదట పూజా హెగ్డేను ఎంపిక చేశారు. సెకండ్ హీరోయిన్‌గా అంటే మహేష్ బాబు మరదలి పాత్రకు శ్రీలీలను తీసుకున్నారు. కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యాక డేట్స్ ఖాళీగా లేవంటూ పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకుంది. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, అగ్ర నిర్మాణ సంస్థ విషయంలో పూజా ఇలా చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది.
మేకర్స్ పూజా హెగ్డే స్థానాన్ని శ్రీలీలతో భర్తీ చేసి.. మీనాక్షి చౌదరికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఎప్పుడైతే గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకుందో అప్పటినుంచి ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు ఆగిపోయాయి. గత రెండేళ్లుగా ఒక్క తెలుగు సినిమా కూడా పూజా హెగ్డే సైన్ చేయలేదు. తమిళ్, హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. మరి పూజా హెగ్డేకు తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం లేదా? ఒకవేళ వచ్చినా ఆమే రిజెక్ట్ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ కు జోడిగా `జన నాయగన్`, లారెన్స్ తో `కాంచన 4` చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్ లో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` మూవీలో నటిస్తోంది.