భారత్ మరియు అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు చాలా బలంగా ఉండేవి. వ్యాపార విషయాలలో మాత్రమే కాకుండా భారత్ , అమెరికా మధ్య అనేక విషయాలలో కూడా మంచి సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. దానితో ఇలా చాలా కాలం పాటు భారత్ , అమెరికా మధ్య మంచి సంబంధాలు కొనసాగుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం భారత్ , అమెరికా మధ్య చాలా బలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు పదవిలోకి ట్రంప్ వచ్చాక పరిస్థితులు చాలా వరకు మారుతున్నాయి. ఈయన చేస్తున్న కొన్ని ప్రకటనలు భారత్ పై ప్రత్యక్షంగా , పరోక్షంగా కూడా ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి. ఇకపోతే తాజాగా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ భారత్ పై పెద్ద ఎత్తున విధిస్తూ వస్తున్నాడు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత కాలం క్రితం భారత్ , రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్ పై 25% శాతం సుంకలను విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే 25% సుంకాలతో పాటు అదనంగా పెనాల్టీని కూడా విధిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ట్రంప్ అంతటితో ఆగకుండా మరో సారి భారత్ , రష్యా నుండి చమరును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్ పై మరో 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఇలా ఒకే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దఫాలుగా సుఖాలను విధించి మొత్తంగా 50% సుంకలను విధించాడు.

దీనితో భారత్ , రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తున్నంత సేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై ఇలాగే సుంకాలను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే భారత్ , రష్యా నుండి చమరు కొనుగోలు నిలిపి వేసే వరకు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ భారత్ తో వాణిజ్య ఒప్పందాల చర్చలకు కూడా వచ్చే అవకాశాలు లేవు అని కూడా అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: