కంగనా రనౌత్.. ఒక హీరోయిన్ గానే కాదు .. ఒక లేడీ టైగర్ అంటూ అందరూ పిలుస్తూ ఉంటారు . కేవలం సినిమా ఇండస్ట్రీలో కాదు రాజకీయాలలో తనదైన స్టైల్ లో సత్తా చాటుతుంది . బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎక్కడ ఉంటే అక్కడ ఫైర్ బ్రాండ్ లా బ్లాస్ట్ అయిపోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎదిరించి మాట్లాడరు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కల్పిస్తూ చెప్తూ ఉంటారు అనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది.

కానీ కంగనా రనౌత్ విషయంలో మాత్రం అది పూర్తిగా వ్యతిరేకం . ఉన్నది ఉన్నట్లు ఆమె బోల్డ్ గా మాట్లాడేస్తుంది . అక్కడ జరిగింది తప్పు అంటే అక్కడ ఉన్నది  ఎవరైనా సరే ఆ వ్యక్తిని వేలెత్తి చూపిస్తుంది . రీసెంట్ గా కంగనా రనౌత్ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితుల గురించి ఓపెన్ అప్ అయ్యింది . దీంతో మరొకసారి ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది.

"ఇండస్ట్రీలో మార్పులు అనేటివి సహజం . ఇండస్ట్రీ అంటేనే మార్పులమయం . హీరోయిన్స్ విషయంలో పరిస్థితులకు తగ్గట్టు మార్పులు సహజమే . అది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ . అది ఒక సాంప్రదాయంలో ముందుకెళ్ళిపోతుంది. అది అంగీకరించక తప్పదు . ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్టు మారుతూ ఉండాలి " అంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. "అంతేకాదు హీరోయిన్స్ లైమ్ లైట్ లో ఉండాలి అంటే మార్పు స్వీకరించాలి అని ..లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారు అని ఆమె క్లారిటీగా తెలిపింది". కంగనా రనౌత్ ఇంత డేరింగ్ గా మాట్లాడటంతో అంద్రౌ ఫిదా అవుతున్నారు. కంగనా రనౌత్  మాట్లాడిన మాటలకు చాలామంది సినీ హీరోయిన్స్ కనెక్ట్ అవుతున్నారు. కాగా కంగనా చాలా చాలా మంచి సినిమాలల్లో కూడా నటించింది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఆమె దగ్గరైన సినిమా మాత్రం"ఏక్ నిరంజన్". ఈ సినిమాలో ప్రభాస్ తో స్క్రిన్ షేర్ చేసుకుంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: