యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమాలో బాబీ డియోల్ క్లైమాక్స్ లో కనిపిస్తారనే వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ వార్తలను నిజమేనని నమ్మారు. అయితే ఆ సినిమాలో కనిపించని ఈ నటుడు వార్2 సినిమాలో మాత్రం కనిపించనున్నారని సమాచారం అందుతోంది. అయితే వార్2 మూవీ ఈ నటుడు నిజంగానే ఉన్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

సినిమా క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో బాబీ డియోల్ కనిపిస్తారని ఆ పాత్రతోనే  క్లైమాక్స్ కు ముగింపు ఉండనుందని సమాచారం అందుతోంది. సాధారణంగా బాబీ డియోల్  కథ అద్భుతంగా ఉంటే  తప్ప ఓకే చెప్పారు. ఆయన సినిమాల ఎంపిక సైతం ఇతర నటులకు భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్  లు ఉంటాయని చెప్పగా ఆ సర్ప్రైజ్ లలో ఇది కూడా ఒకటని తెలుస్తోంది.  యానిమల్ సినిమాతో బాబీ డియోల్ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబీ డియోల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య చాలా గొప్ప నటుడని కంగువా  సినిమా మంచి విజయం సాధిస్తుందని అందరూ  అనుకున్నామని చెప్పుకొచ్చారు.

కానీ మేము ఆశించింది జరగలేదని స్క్రిప్ట్ వర్కౌట్ కాకపొతే ఎవరూ  ఏమీ చేయలేరని కొన్నిసార్లు నేను ఏమీ ఆలోచించకుండా షూట్ ఎంజాయ్ చేస్తానని అలా నేను ఎంజాయ్ చేసిన సినిమాలలో కంగువా  ఒకటని ఆయన పేర్కొన్నారు. నేను నటుడిగా ఎదగడానికి సినిమాలు చేస్తున్నానని అలా  ఎంజాయ్ చేసిన వాటిలో కంగువా  ఒకటి అని చెప్పుకొచ్చారు. డాకు  మహారాజ్ మూవీలో బాలయ్యతో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన కామెంట్లు చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: