
సాధారణంగా ఒక ఇండస్ట్రీ హీరో మరొక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే, పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్లు ఎంతమంది ఉంటారో.. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లు అంతకంటే ఎక్కువగా ఉంటారు. “మన ఇండస్ట్రీలోకి వేరే హీరో ఎందుకు రావాలి, అతన్ని తగ్గించేద్దాం, అవకాశాలు ఇవ్వకుండా చేద్దాం” అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. బాలీవుడ్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అలాంటి నెగిటివిటీని ఎదుర్కొన్నారు. కానీ ఆయన తన కష్టాన్ని, నిజాయితీని నమ్ముకున్నారు. అందుకే బాలీవుడ్‌లో కూడా ఆయన సక్సెస్ సాధించారు. వార్ 2 సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్‌లో కొంతమంది “ఇండస్ట్రీకి ఇలాంటి హీరోనే కావాలి” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆ డాన్సింగ్ స్టైల్ ఏంటి బాస్! ఆ డైలాగ్ డెలివరీ ఏంటి బాస్! కెవ్వు కేక… గూస్‌బంప్స్ తెప్పించావ్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఇది ఒక వర్షన్ మాత్రమే. బాలీవుడ్‌లో ఇంకో కోణం కూడా ఉంది. కొంతమంది పెద్ద వ్యక్తులు, సినీ ప్రముఖులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ నటనపై నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. “మా హీరోలే ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఉండాలి, పక్క ఇండస్ట్రీ వాళ్లు మా ఇండస్ట్రీలో ఎందుకు?” అని భావిస్తూ రివ్యూస్ ఇస్తున్నారు. “జూనియర్ ఎన్టీఆర్ నటన, డాన్స్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా హృతిక్ రోషన్‌ను మాత్రమే చూడాలని అనిపించింది, స్క్రీన్ మొత్తం హృతిక్ రోషన్ హైలైట్ అయ్యాడు” అని కొంతమంది అంటున్నారు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు వార్ 2 విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్ హైలైట్ అయ్యారని చెబుతున్నారు. దీని వల్ల బాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్‌కు సరైన గుర్తింపు ఇవ్వలేదని కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.
కానీ తెలుగులో మాత్రం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ను సరిసమానంగా చూస్తున్నారు. “వార్ 2 సినిమాకు ఒక కన్ను హృతిక్ రోషన్ అయితే, మరొక కన్ను జూనియర్ ఎన్టీఆర్” అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక చూడాలి, ఫస్ట్ డే ఈ వార్ 2 సినిమా ఏ విధమైన కలెక్షన్స్ సాధిస్తుందో..?