కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్. చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఈ యువ హీరో, ఇప్పుడు పెద్ద హిట్స్ తో 300 కోట్ల క్లబ్ దాకా వెళ్లిపోయాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన అమరన్ సినిమా శివ కార్తికేయన్ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్. ఏకంగా 300 కోట్ల వసూళ్లతో ఆయనను స్టార్ హీరోల జాబితాలో నిలబెట్టింది. అదే జోష్ లో ఇప్పుడు మరో హై వోల్టేజ్ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఆ సినిమా “మదరాసి”. డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎందుకంటే మురుగదాస్ పేరు వింటేనే మనకి గుర్తొచ్చే సినిమాలు గజినీ, కత్తి లాంటివి. ఒకప్పుడు తన సినిమాలతో కోలీవుడ్, బాలీవుడ్ రెండింటినీ షేక్ చేసిన ఈ డైరెక్టర్, మధ్యలో చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్, తెలుగులో చేసిన స్టాలిన్, స్పైడర్ – ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
 

ఆ డిఫీట్ షేడో నుంచి బయటపడేందుకు మురుగదాస్ ఇప్పుడు మదరాసి మీద బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రచారంలోనూ మదరాసి సినిమాను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ, “ఇది గజినీ లాంటి లవ్ స్టోరీ” అని మురుగదాస్ స్వయంగా చెప్పడం మరింత హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసింది. గజినీ పేరు వింటేనే ఆడియన్స్ లో ఇప్పటికీ జ్ఞాపకాలు మిగిలి ఉంటాయి. అలాంటి క్లాసిక్ ను గుర్తు చేసేలా ఈ సినిమా లవ్ స్టోరీ ఉంటుందన్న మాట విన్న వెంటనే అంచనాలు రెట్టింపయ్యాయి. మదరాసి సినిమా కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగేలా ఉంటుంది. హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ రుక్మిణి వసంత్ మధ్య జరిగే లవ్ స్టోరీ సినిమాకు బలమైన హృదయాన్ని ఇస్తుందని టాక్. రుక్మిణి వసంత్ – “సప్తసాగరాలు దాటి” సినిమా సక్సెస్ తో దక్షిణాదిలోనే కాదు, పాన్ ఇండియా లెవెల్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.



 ఇప్పుడు మదరాసి సినిమాలో ఆమె ప్రెజెన్స్ ఒక పెద్ద ఎట్రాక్షన్ అవుతుంది. అంతేకాదు, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా రుక్మిణి ఛాన్స్ కొట్టేయడంతో ఈ భామ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సెప్టెంబర్ 5న మదరాసి రిలీజ్ అవుతుంది. అదే రోజున తేజా సజ్జ మిరాయ్, అనుష్క ఘాటి సినిమాలు వస్తుండడంతో గట్టి పోటీ ఏర్పడుతుంది. అయినా కూడా శివ కార్తికేయన్మురుగదాస్ కాంబో మీద ఉన్న హైప్ మదరాసికి హెల్ప్ చేయనుంది. గజినీ తరహా లవ్ స్టోరీ, పొలిటికల్ యాక్షన్ డ్రామా మిక్స్ తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే, మురుగదాస్ కెరీర్ కి మళ్ళీ గజినీ లాంటి గోల్డెన్ ఎరా మొదలవుతుంది. ఇక శివ కార్తికేయన్ మాత్రం కొలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ కి ఎంటర్ అవ్వడం పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: