మన ఇండియా లోకి కరోనా రాక ముందు ఓ టీ టీ లో ఎక్కువ శాతం ప్రేక్షకులు సినిమాలు చూసేవారు కాదు. అలాగే వెబ్ సిరీస్లను కూడా ఎక్కువ శాతం చూసేవారు కాదు. ఎప్పుడు అయితే దేశం లోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఓ టి టి లో ఉన్న సినిమాలను , వెబ్ సిరీస్ లను , ఇతర కంటెంట్ చూడడానికి మన ఇండియన్ ప్రేక్షకులు ఎక్కువగా అలవాటు పడ్డారు. దానితో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాక నెల గడిచాక , మరి కొన్ని సినిమాలు నెలనార గడిచాక ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే ఓ టీ టీ లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు విడుదల అయ్యి నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి వస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ నటుడు నటించిన ఓ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా గడపక ముందే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్గా తలైవన్ తలైవి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. 

సినిమా జూలై 25 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో ఆగస్టు 22 వ తేదీన నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా విలువడింది. ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా తిరగకుండానే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs