
మనందరికీ తెలిసిందే.. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగిన సందర్భంలో నాగవంశీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అప్పట్లో సినిమాకి సంబంధించి హైలెట్ అవుతూ మాట్లాడుతూ, "ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చకపోతే నేను మీకు ఏ సినిమా చూడమని చెప్పను" అంటూ ఘాటుగా వార్ 2ని పొగడ్తలతో ముంచెత్తారు. నిజంగా సినిమా హిట్ అయి ఉంటే నాగవంశీ పేరు మారుమ్రోగిపోయేది. కానీ సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకోవడంతో అనుకున్నంత హిట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు నాగవంశీని ఏకేస్తున్నారు.
"వేర్ ఈజ్ నాగవంశీ..? సినిమా హిట్ కాలేదు, ఇప్పుడు ఏమి మాట్లాడుతాడు?" అని ట్రోల్ చేస్తున్నారు. "మైక్ కనిపిస్తే ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, రివ్యూవర్స్‌ని దెబ్బకొడతాడు. కానీ ఇప్పుడు వార్ 2 విషయంలో నాగవంశీ మాట్లాడిన మాటలను ఎలా కవర్ చేసుకుంటాడు?" అని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాగవంశీ ఊహించని విధంగా వరుసగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. కింగ్డమ్ సినిమా విషయంలోనూ ఆయనను ఇలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా అదే పరిస్థితి. అసలు నాగవంశీ ఎక్కడ? సినిమా గురించి ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.