సౌత్ ఇండియాలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో మురుగదాస్ ఒకరు. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సికిందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సల్మాన్ ఖాన్ అభిమానులకు సైతం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో తనకు సంబంధం లేదని మురుగదాస్ అన్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు  100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది  రష్మిక, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.  సికిందర్ మూవీ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉందని  కానీ నేను  బాగా తెరకెక్కించలేకపోయానని ఆయన వెల్లడించారు.  కానీ దానికి నేను మాత్రమే బాధ్యత వచించానని ఆయన  అభిప్రాయం వ్యక్తం చేశారు.

గజినీ మూవీ రీమేక్ అయినప్పటికీ బాగా ఆడిందని మురుగదాస్ వెల్లడించారు.  సికిందర్ స్ట్రెయిట్ సినిమా అని అక్కడ నాకు కమాండింగ్  యూనిట్ లేదని దర్శకుడు చెప్పుకొచ్చారు.  నేను అనుకున్న కథను మార్చేశారని  కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏమీ చేయలేకపోయానని అందువల్ల ఆ సినిమా ఫ్లాప్ కావడానికి నేను బాధ్యత వహించానని దర్శకుడు కామెంట్లు చేశారు.

 ఇదే ఇంటర్వ్యూలో మురుగదాస్ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం ఎంతోమంది డైరెక్టర్లు  1000 కోట్ల రూపాయల సినిమాలు తీస్తున్నారని  ఆ దర్శకులు చేస్తున్న సినిమాలు జనాలను కనువిందు చేసే విధంగా ఉన్నాయని  మురుగదాస్ చెప్పుకొచ్చారు.  కోలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు మాత్రమే ప్రభావవంతమైన సినిమాలు తీయగలరని  ఆయన చెప్పుకొచ్చారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: