నిన్నటి రోజున కోటా శ్రీనివాసరావు భార్య మరణ వార్త అభిమానులను కలిసివేసింది. ఇప్పుడు తాజాగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ,భార్య పద్మజ ఈరోజు ఉదయం తెల్లవారుజామున మరణించినట్లుగా తెలుస్తోంది. నందమూరి జయకృష్ణ, పద్మజ కుమారుడే చైతన్య కృష్ణ. గతంలో ధమ్ చిత్రంలో నటించిన చైతన్య కృష్ణ ఆ తర్వాత మళ్లీ చాలాకాలం తర్వాత బ్రీత్ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది దీంతో ఆ తర్వాత మళ్లీ తదుపరి చిత్రాలను మాత్రం ప్రకటించలేదు చైతన్య కృష్ణ.


సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కోడలు, చైతన్య కృష్ణ తల్లి, జయ కృష్ణ భార్య పద్మజ 73 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యతో బాధపడుతూ మరణించింది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు తెల్లవారుజామున హాస్పటల్లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం విన్న వెంటనే అటు నందమూరి అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిగా హైదరాబాద్ కి బయలుదేరారు.


అలాగే ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురేందేశ్వరి తో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హుటాహుటిగా బయలుదేరి హైదరాబాద్ కి వస్తున్నారు. పద్మజ ఎవరో కాదు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి స్వయానా సోదరి.. అంటే ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఈమె సోదరీ అవుతారు. ఇక్కడ ఎన్టీఆర్ దగ్గుబాటి కుటుంబంతో కుండ మార్పిడి పెళ్లి జరిపించారు. అంతేకాకుండా పద్మజ భర్త జయ కృష్ణ కూడా సినిమాటోగ్రాఫర్ గా పలు చిత్రాలకు పని చేశారు. ఈ విషయం మాత్రం అటు అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: