టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘వార్ 2’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోవడం, దర్శకుడు అయాన్ ముఖర్జీ క్రియేటివ్ టచ్ ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు ఇది ప్రత్యేకమైన క్షణం. ఎందుకంటే బాలీవుడ్‌లోని అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీలో తమ హీరో భాగమవ్వ‌డంతో వారు కూడా ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేశారు.


అయితే, విడుదలైన తరువాత ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనలు మాత్రం మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. తొలి రోజు  భారీ ఓపెనింగ్స్ సాధించినా, వర్క్‌డేస్ కలెక్షన్స్ గణనీయంగా తగ్గిపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ దిశగా వెళ్తుందని సినీ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద నిరాశగా మారింది. కారణం గత 11 ఏళ్లుగా ఎన్టీఆర్ హిట్ ట్రాక్ రికార్డ్ కొనసాగిస్తూ వస్తున్నాడు. ‘బాద్‌షా’ తర్వాత ‘టెంపర్’, ‘జనతా గ్యారేజ్’, ‘అరవింద సమేత’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ స్ట్రీక్ మొదటిసారి ఆగిపోయినట్టే అనిపిస్తోంది.


మ‌రీ ముఖ్యంగా టెంప‌ర్ నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ అన్న‌దే లేదు. ఇప్పుడు వార్ 2 రూపంలో ఎన్టీఆర్‌కు ప్లాప్ ప‌డినా కూడా అభిమానులు నిరాశ చెందడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనుంది. ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లతో తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్‌తో జూనియర్ ఎన్టీఆర్ కలయికపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ అత్యంత మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోందని టాక్. అంతేకాకుండా భారీ బడ్జెట్, అత్యాధునిక టెక్నికల్ వర్క్‌తో సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఈ సినిమాపైనే తమ ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: