
సిద్ధార్థ్ మల్హోత్ర , జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రమే పరమ్ సుందరి. తుషార్ జలోట డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కించారు.. ఆగస్టు 29న హిందీలో ఈ సినిమా ప్రేక్షకులందరికీ రాబోతున్నది. దీంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం వేగవంతంగా చేస్తోంది. జాన్వీ కపూర్ ఇందులో మలయాళీ అమ్మాయిగా కనిపించడంతో మరింత ఆకట్టుకుంది. కానీ జాన్వీ లుక్స్, దుస్తులు, యాస పైన బాగానే బజ్ ఏర్పడినట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా ఈమె పాత్ర పైన ప్రముఖ మలయాళీ సింగర్లో ఒకరైన పవిత్ర అసంతృప్తిని తెలియజేస్తోంది.
మలయాళం అమ్మాయి పాత్రలో మలయాళ అమ్మాయి కాకుండా బాలీవుడ్ హీరోయిన్ ని ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించింది?.. జాన్వీ మలయాళ యాసను విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారడంతో పవిత్ర వీడియో పైన జాన్వీ ఫ్యాన్స్ ఒక్కసారిగా కౌంటర్లు వేశారు.దీంతో వెంటనే ఆమె ఆ వీడియోను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన పవిత్ర రియాక్ట్ అవుతూ స్క్రీన్ షాట్ లో షేర్ చేస్తూ మరింత వివాదాన్ని హైలైట్ చేస్తోంది. కొంతమంది మలయాళం ప్రేక్షకులు పవిత్రకి సపోర్ట్ చేస్తే మరి కొంతమంది జాన్వీ కి సపోర్టు చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా విమర్శించడం కూడా తప్పంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.