టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ తండ్రి కొడుకులు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే దాదాపుగా చిరంజీవి నటించిన సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని నెలల గ్యాప్లో రామ్ చరణ్ హీరో గా నటించిన సినిమా విడుదల అయినట్లయితే ఆ రెండు మూవీలకి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం వరుస పెట్టి చిరు , చరణ్ నటించిన సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... చాలా కాలం క్రితం చిరు "విశ్వంభర" అనే సినిమాను మొదలు పెట్టాడు.

మూవీ కి చాలా గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ మూవీ విడుదల చాలా లేట్ అవుతుంది. తాజాగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చరణ్  "పెద్ది" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ రెండు సినిమాలు సమ్మర్ లోనే విడుదల కాబోతున్నాయి.

మరి ఈ రెండు సినిమాల మధ్య విడుదలకు ఏమైనా గ్యాప్ ఉంటుందా ... లేదా చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు విడుదల అవుతాయా అనే వాదనను  కొంత మంది వినిపిస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదల మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉన్నట్లయితే ఈ రెండు సినిమాల కలెక్షన్లను కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: