టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన డాన్సర్ గా గుర్తింపును సంపాదించుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన కేరిర్ ప్రారంభం నుండి తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. తారక్ కేరిర్ ను స్టార్ట్ చేసిన కొత్తలో కాస్త లావుగా ఉండేవాడు. అలా లావుగా ఉన్న సమయంలో కూడా ఆయన తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తారక్ ఆ తర్వాత చాలా వరకు బరువు తగ్గాడు. ఇక బరువు తగ్గక అతని డ్యాన్స్ లో మరింత గ్రేస్ పెరిగింది. ఇప్పుడు అద్భుతమైన డ్యాన్స్ తో తారక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ అద్భుతమైన డాన్సర్ మరియు స్టార్ హీరోయిన్ తల్లి తారక్ ను చూసే నా కూతురుని డ్యాన్సర్ ను చేశాను అని చెప్పుకొచ్చింది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మధ్య కాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న వారిలో శ్రీ లీల ఒకరు. శ్రీ లీల దాదాపు నటించిన ప్రతి సినిమాలో తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగడం మాత్రమే కాకుండా ఈమెకు అద్భుతమైన డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. 

తాజాగా శ్రీ లీల తల్లి మాట్లాడుతూ ... శ్రీ లీల డ్యాన్స్ స్కిల్స్ కి ఎన్టీఆర్ స్ఫూర్తి అని వెల్లడించింది. ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చూడడం మొదలు పెట్టిన సమయం నుండి తనకు కూతురు గాని పుడితే సీరియస్ గా తను డ్యాన్స్ నేర్చుకునేలా చేయాలి అని నిర్ణయించుకున్నట్లు శ్రీ లీల తల్లి తాజాగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా మాత్రమే కాకుండా డాన్సర్ గా కూడా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈమె నటించిన ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా ఈమె చాలా సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: