కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచ యం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రి తం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఇప్పటికే విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు . ఇక ప్రస్తుతం విజయ్ "జన నాయకన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇదే తన చివరి సినిమా అని కూడా ప్రకటించాడు. దానితో విజయ్ అభిమానులు ఈ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నందమూరి బాలకృష్ణ హీరో గా రూపొందిన భగవంత్ కేసరి మూవీ కి రీమేక్ అని ఓ వార్త వైరల్ అవుతుంది. 

కానీ ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తాజాగా జన నాయకన్ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయకన్ మూవీ లో ఓ కీలకమైన సన్నివేశంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయినటువంటి అట్లీ , లోకేష్ కనగరాజ్ , నెల్సన్ దిలీప్ కుమార్ న్యూస్ రిపోర్టర్లుగా కనిపించబోతున్నట్లు , ఈ సన్నివేశం ఈ సినిమాకే అత్యంత హైలెట్ గా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాలో కనిపించనున్నారు అనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే అట్లీ , లోకేష్ కనగరాజ్ , నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ముగ్గురి దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో కూడా విజయ్ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: