టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. నీది అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమా చాలా డిలే అవుతూ రావడంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... ఏ ఏం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కావడం , ఆయన చాలా కాలం తర్వాత ఓ రీమేక్ మూవీ లో కాకుండా ఒరిజినల్ మూవీ లో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు అన్ని ప్రాంతాలలో జరిగింది.

మూవీ కి సీడెడ్ ఏరియాలో ఏకంగా 16.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక సీడెడ్ ఏరియాలో భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం సిడెడ్ ఏరియాలో 8.25 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లను మాత్రమే రాబట్టింది. దానితో ఈ మూవీ సిడెడ్ ఏరియాలో మరో 8.25 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. కానీ అది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. దానితో ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: