
ఇంతలోనే మరోసారి ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చే ఒక వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో ప్రచారంలోకి వచ్చిన సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా కమిట్ అయిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆయన చేతుల నుండి జారిపోయిందట. స్వయాన ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది అని టాక్ వస్తోంది. మేకర్స్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ను రణబీర్ కపూర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్‌కు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక హై బడ్జెట్, హై రిస్క్ ప్రాజెక్ట్ అని కూడా సమాచారం. "వార్ 2" లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత మళ్లీ రిస్క్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడలేదని, అందుకే మేకర్స్‌కి క్షమాపణలు చెబుతూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఆ స్థానంలోలి రణబీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఈ వార్తలతో మారుమ్రోగిపోతుంది. దీంతో నందమూరి అభిమానులు మరింత నిరాశలో మునిగిపోయారు. ఒకవైపు "వార్ 2" ఫ్లాప్ కారణంగా బాధపడుతుంటే, మరోవైపు ఎన్టీఆర్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ వేరే హీరో చేతుల్లోకి వెళ్లిపోవడం అభిమానులకు గుండెల్లో గుచ్చినట్లైంది.