డాన్స్ కొరియో గ్రాఫర్ , దర్శకుడు , మరియు నటుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన డాన్స్ కొరియో గ్రాఫర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని , కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకుని దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ "బెంజ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

బక్కియరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఈ సినిమాకు కథను అందించడం , అలాగే ఈ సినిమా నిర్మాతలలో ఒకడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించే సినిమాలలో అనేక పాత్రలు ఉంటాయి. అలాగే కొన్ని పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానితో ఆయన అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులను ఆ పాత్రలలో పెడుతూ ఉంటాడు.

బెంజ్ మూవీ లో కూడా అలాంటి అత్యంత కీలకమైన పాత్ర ఒకటి ఉన్నట్లు , దానితో ఆ పాత్రలో కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి జయం రవి ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే బెంజ్ మూవీ బృందం జయం రవి ని కలవనున్నట్లు , ఆయనకు కథను వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ జయం రవి కి ఆ సినిమా కథ , అందులోని ఆయన పాత్ర నచ్చినట్లయితే ఆయన బెంజ్ మూవీ లో నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ జయం రవి గనుక బెంజ్ మూవీ లో నటించినట్లయితే ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: