నందమూరి నటసిపం బాలకృష్ణ కొన్ని సంవత్సరాలు క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రలో నటించాడు. ఒక పాత్రలో రైతుగాను , మరో పాత్రలో అఘోర గా నటించి రెండు పాత్రలలో కూడా తనదైన వేరియేషన్స్ చూపించి తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సినిమా ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకున్నాక ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 ను రూపొందించనున్నట్లు బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు. చెప్పిన విధంగానే కొంత కాలం క్రితమే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి అనిల్ సుంకర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అఖండ 2 మూవీ కి సంబంధించిన అదిరిపోయే రేంజ్ అప్డేట్ ను ప్రకటించాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ సుంకర మాట్లాడుతూ ... నేను తాజాగా అఖండ 2 మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూసాను అవి అద్భుతంగా వచ్చాయి. బోయపాటి గారు సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. బాలకృష్ణ గారు అద్భుతంగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. బాలకృష్ణ గారు ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు అని అనిల్ సుంకర తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇలా అనిల్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: