తెలుగు సినీ ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన మూవీ మహావతార్ నరసింహా. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా జులై 25న విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకొని, ఐదో వారంలోకి అడుగుపెట్టిన ఈ యానిమేటెడ్ మూవీ, పెద్ద సినిమాలకు అసలైన షాక్ ఇచ్చింది. రిలీజ్ సమయంలోనే హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2, కూలీ లాంటి బడా స్టార్ల సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికీ .. మహావతార్ నరసింహా మాత్రం వాటన్నింటినీ తట్టుకొని ముందుకు దూసుకెళ్లింది. అంతేకాదు, రిలీజ్ అయిన చిన్న సినిమాలపై కూడా గట్టి ప్రభావం చూపింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఒక యానిమేటెడ్ సినిమాకు ఇంతటి స్పందన రావడం నిజంగా అద్భుతం అని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.


ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు మేకర్స్ కు వందల కోట్లు లాభాలను తీసుకొస్తోంది. అటు హిందీ వెర్షన్ లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే హిందీలో రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. తెలుగులోనూ దూసుకుపోతూ లాంగ్ రన్ వసూళ్లతో మాస్ ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ, శాటిలైట్ డీల్స్ రూపంలో మరింత లాభాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్స్ చర్చల్లో ఉన్నప్పటికీ.. ఆఫర్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో మేకర్స్ సేఫ్ జోన్ లో కాకుండా.. సూపర్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయారు.



ఈ విజయంతో యానిమేషన్ సినిమాలకు తెలుగు మార్కెట్లో కొత్త బాటలు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు మంచి కంటెంట్, అద్భుతమైన టెక్నికల్ వర్క్ ఉంటే.. అది లైవ్ యాక్షన్ కావొచ్చు, యానిమేషన్ కావొచ్చు.. ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుందని మరోసారి రుజువైంది. మహావతార్ నరసింహా ఇప్పుడు కేవలం ఒక సినిమా కాదు, తెలుగు యానిమేషన్ చరిత్రలో గోల్డెన్ చాప్టర్ లా నిలిచిపోయింది. చిన్న సినిమాగా మొదలై.. భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ, ఇంకా ఎంత దూరం దూసుకుపోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: