పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అర్జున్ దాస్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ కి సంబంధించిన నార్త్ అమెరికా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగానే ఈ మూవీ కి అక్కడి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్ లు ఓపెన్ అయిన 24 గంటల సమయం లోనే ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఆఖరుగా నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన చాలా రోజుల కలెక్షన్లను వెనక్కు నెట్టేసినట్టు తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా ఫ్రీ సేల్స్ ను ఓజి మూవీ అవలీలగా దాటి వేస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దానితో పవన్ కళ్యాణ్ తన సినిమా రికార్డును తానే కొల్ల గొట్టడం ఖాయం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి ఓజి మూవీ పై అదిరిపోయే రేంజ్ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: