కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా ట్రెండింగ్ లోకి వచ్చేసారు. ఇటీవలే తాను ప్రేమించిన హీరోయిన్ ధన్సిక తో విశాల్ పుట్టినరోజున ఎంగేజ్మెంట్ చేసుకొని అందుకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఇలాంటి సమయంలోనే ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదని విషయంపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చేశారు. విశాల్ ఇలా మాట్లాడుతూ.. సుమారుగా 9 ఏళ్ల పాటు తాను ధన్సిక తో వివాహం కోసం ఎదురు చూశాను.. ముఖ్యంగా తమిళ నడిఘర్ సంఘం భవనం కట్టిన తరువాతే అందులో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయాన్ని తాను ఇప్పటికీ ఎన్నోసార్లు తెలిపానని వెల్లడించారు.


ధన్సిక కూడా ఈ విషయంపై ఒప్పుకోవడం వల్లే ఇన్నేళ్లు  పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఒకవేళ ధన్సిక ఒప్పుకోకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అంటూ వెల్లడించారు. మరో రెండు నెలలో నడిగర్ సంఘం భవనం పూర్తి అవుతుందని అందులోనే మా వివాహం జరుగుతుందని.. అందుకు సంబంధించి అందులో ఉండే ఆడిటోరియం కూడా బుక్ చేసుకున్నామని తెలిపారు విశాల్. నడిగర్ సంఘం ఎన్నికలలో విశాల్ పోటీ చేసే సమయంలో తాను ఈ భవనాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చారు.


అంతేకాకుండా ఆ భవనం నిర్మించి అందులోనే  తాను వివాహం చేసుకుంటానని కూడా ఆరోజు తెలియజేశారు విశాల్. ఎట్టకేలకు భవనాన్ని పూర్తి చేసి అందులోనే తన పెళ్లి చేసుకుంటున్నారు. ధన్సిక తో సుమారుగా కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన విశాల్ కానీ ఎప్పుడు ఈ విషయాన్ని  బయటకు చెప్పలేదు. కానీ ఆమధ్య ఒక సినిమా ఈవెంట్లో తన పెళ్లి ప్రస్తావనను  తీసుకొచ్చారు విశాల్. విశాల్ పెళ్లి కోసం అభిమానులు చాలానే ఎదురు చూశారు. ముఖ్యంగా ఎవరిని వివాహం చేసుకుంటారనే విషయంపై ఎదురు చూసిన  అభిమానుల కోరిక నెరవేరబోతోంది. నిన్నటి రోజున ఎంగేజ్మెంట్ తో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు విశాల్,ధన్సిక.

మరింత సమాచారం తెలుసుకోండి: