పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సినిమాల్లో రెండు రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రథమ ధ్యేయం అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక షాకింగ్ విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది.. అదేంటంటే పవన్ కళ్యాణ్ జీవితంలో ఉండే కళ్యాణి..ఈ విషయం తెలియడంతోనే చాలామంది నెటిజన్లు ఇంతకీ ఈ కళ్యాణి ఎవరు అని అనుకుంటారు. అయితే కళ్యాణి అంటే ఎవరో అమ్మాయి కాదు.కళ్యాణి అంటే పవన్..అదేంటి పవన్ పేరు పవన్ కళ్యాణ్ కదా..కానీ ఈ కళ్యాణి ఎక్కడి నుండి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు.అయితే కళ్యాణి అని ముద్దుగా పవన్ కళ్యాణ్ ని ఒకరు పిలిచేవారట. 

వాళ్ళు ఎవరో కాదు తాజాగా మరణించినటువంటి అల్లు అరవింద్ తల్లి అల్లు కనక రత్తమ్మ.. చిరంజీవి అత్త కనక రత్నమ్మ పవన్ కళ్యాణ్ ని కళ్యాణి కళ్యాణి అని ఎంతో ప్రేమగా పిలుచుకునేదట.అంతేకాదు చిరంజీవి సురేఖ పెళ్ళైన సమయంలో పవన్ కళ్యాణ్ ని అల్లుడిలా కాకుండా మనవడిలా, కొడుకులా చూసుకునేదట. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో అల్లు కనకరత్నం గారికి ప్రత్యేకమైన బాండింగ్ ఉందట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 6th క్లాస్ చదువుతున్నప్పటి నుండే ఆయన్ని సినిమాల్లో తీసుకోండి అని చాలాసార్లు అల్లు అరవింద్ కి చెప్పిందట. అంతేకాదు మొట్టమొదటిసారి సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్లాలి అని కోరుకున్న వ్యక్తి కూడా సురేఖ కాదట సురేఖ తల్లి అల్లు కనకరత్నమ్మనట..

అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తాను నటించిన తీన్ మార్ మూవీ ఈవెంట్లో బయటపెట్టారు. అల్లు అరవింద్ గారి అమ్మగారు అల్లు కనకరత్నమ్మ గారి వాళ్లే నేను సినిమాల్లోకి వచ్చాను. నన్ను సినిమాల్లోకి పంపాలనే ఆలోచన మొదట వచ్చింది అల్లు కనక రత్నమ్మ గారికే.. ఇంట్లో చాలాసార్లు అల్లు అరవింద్ గారితో గొడవ పెట్టుకునేది. ఎందుకంటే నన్ను సినిమాల్లోకి తీసుకోమని.. ఇక అల్లు కనకరత్నమ్మ గారు ప్రతిసారి నన్ను కళ్యాణి కళ్యాణి అంటూ ముద్దుగా పిలిచేవారు అంటూ ఆ పెద్దావిడితో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకోచ్చారు. అయితే అల్లు కనక రత్నమ్మని చివరి చూపు చూడడానికి ఆయన రాలేదు.కానీ సోషల్ మీడియా వేదికగా అల్లు కనక రత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక పోస్ట్ అయితే పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: