మరికొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో బుల్లి తెరపై 8 ,  ఓ టీ టీ లో ఒక సీజన్ కంప్లీట్ అయింది. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 9 వ సీజన్ ప్రారంభం కానుండడంతో ఈ సారి సీజన్లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై బిగ్ బాస్ అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఇక బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది వీరే అంటూ అనేక మంది పేర్లు తెర పైకి వచ్చాయి. కానీ బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు అనేది స్పష్టంగా తెలియాలి అంటే బిగ్ బాస్ కార్యక్రమం మొదలు కావాల్సిందే.

తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దు గుమ్మ అంటూ ఒక నటి పేరు తెగ వైరల్ అవుతుంది. ఆమె నటిగా మాత్రమే కాకుండా మరో విషయంలో కూడా చాలా సంచలనంగా మారింది. ఆమె 700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేసింది అంటూ ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్ని ఓ ఊపు ఊపింది. కానీ ఆ వార్తలు అన్ని అవాస్తవం అని , ఆ ల్యాండ్ స్కాం లో ఆమె పేరును కొంత మంది కావాలనే చేర్చారు అని తర్వాత తెలిసింది. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి రీతు చౌదరి. 

ఈమె పలు సీరియల్లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె కొన్ని టీవీ షో లలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జబర్దస్త్ లో ఈమె హైపర్ ఆది టీం లో అనేక స్కిట్ లను చేసి తన నటనతో ప్రేక్షకులను భాగానే మెప్పించింది. ఇక ఈమె మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే  బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: