తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలో మంచి గుర్తింపును , మంచి విజయాలను దక్కించుకున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ సుశాంత్ హీరో గా రూపొందిన ఇచట వాహనములో నిలుపరాదు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో ఈమె తన అందాలతో నటనతో ప్రేక్షకులను అకట్టుకోవడం వల్ల ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమెకు మొదటి విజయం తెలుగు లో హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఈమె అనేక తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె కొంత కాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తిని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటి కే ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించే సినిమాలు ఈమె హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో మంచి సక్సెస్ను అందుకున్న ఎంతో మంది బ్యూటీ లు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హిందీ సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యారు. మరి మీనాక్షి చౌదరి నిజం గానే హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తే మంచి సక్సెస్ ను అందుకుంటుందా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc