విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి విరాట్ అనుష్క దంపతులకు ఒక కెఫేలో ఘోర అవమానం జరిగిందట. ఏకంగా కెఫే యాజమాన్యం కెఫే నుండి వాళ్ళిద్దర్నీ బయటికి వెళ్లిపోమన్నారట.మరి ఇంతకీ విరాట్ అనుష్క దంపతులకు కెఫే స్టాఫ్ ఎందుకు బయటకు వెళ్ళమన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. క్రికెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు విరాట్ కోహ్లీ.అలాగే సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది అనుష్క శర్మ..వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ జంట అందరికీ తెలిసిపోయింది.అయితే అలాంటి విరాట్ అనుష్కలని ఓ కెఫే యాజమాన్యం బయటికి వెళ్లిపోమన్నారట.దానికి కారణం ఏంటంటే నాలుగు గంటల పాటు కెఫేలో కూర్చొని ముచ్చట్లు పెట్టడమే.. 

ఇక విషయంలోకి వెళ్తే.. భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ అయినటువంటి జెమియా రోడ్రిగ్స్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ అనుష్క దంపతులను మేం న్యూజిలాండ్ లోని ఓ కెఫేలో కలిసి మాట్లాడాం.. అలా క్రికెట్ గురించి విరాట్ కోహ్లీ,స్మృతి మందానా, అనుష్క శర్మ తో దాదాపు నాలుగు గంటలు కెఫేలో మాట్లాడాను. అయితే మొదట కొద్ది నిమిషాలు క్రికెట్ గురించి తర్వాత జీవితం గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నన్ను స్మృతి మందానాని చూసి భారత మహిళా క్రికెట్ ను మార్చగలిగే సత్తా మీ ఇద్దరిలో ఉంది అని పొగిడారు.అలాగే బ్యాటింగ్ గురించి మాట్లాడడంతో దాదాపు నాలుగు గంటలు మాట్లాడుకున్నాం.

అలా క్రికెట్ తో పాటు లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్న సమయంలో తెలియకుండానే నాలుగు గంటలు గడిచిపోయాయి. అయితే మేమంతా ఒకే దగ్గర కలుసుకొని స్నేహితుల లాగే ముచ్చటించుకున్నాం. అయితే ఇదంతా చూసిన కెఫే యాజమాన్యం వీళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడుకుంటారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ వెంటనే కెఫే నుండి వెళ్లిపోండి అని చెప్పారు.అక్కడితో మా మధ్య సంభాషణ ఆగిపోయింది.అలా మేం నాలుగు గంటల పాటు ముచ్చటించుకోవడం వల్ల కెఫే యాజమాన్యం మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు అంటూ జెమియా రోడ్రిగ్స్  మాషబుల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లోని ది బాంబే జర్నీ అనే ఎపిసోడ్లో అనుష్క విరాట్ కోహ్లీలతో జరిగిన ఫన్నీ అనుభవాన్ని బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: