టాలీవుడ్ లో రుమార్డ్ కపుల్ గా పేరు సంపాదించిన జంటలలో విజయ దేవరకొండ, రష్మిక జంట కూడా ఒకటి. వీరిద్దరూ ఒకే చోట కనిపించిన లేకపోతే వేరు వేరు ప్రాంతాలలో కనిపించిన ఎక్కడో ఒకచోట అభిమానులు వీరిని సింక్ చేస్తూ వీరికి సంబంధించి న్యూస్ వైరల్ గా చేస్తుంటారు. అప్పుడప్పుడు ఈ జంట ఒకే కారులో పయనించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీరి మీద వచ్చే రూమర్స్ ఏ ఒక్కరు ఖండించలేదు. 2025 సైమా అవార్డు వేడుకలకు వెళ్లిన రష్మిక.. తన చేతికి ఉన్న ఒక రింగ్ గమనించిన నెటిజెన్స్ ఈ రింగు చూసి విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ రూమర్స్ వైరల్గా చేశారు.


తాజా ఇంటర్వ్యూ లో రష్మిక పాల్గొనగా ఈ విషయంపై ప్రశ్న ఎదురయ్యింది. రష్మిక ఈ విషయంపై మాట్లాడుతూ.. అది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరమని తనకి ఎవరితో కూడా ఎంగేజ్మెంట్ జరగలేదని ఒకవేళ అలాంటిది నిజంగానే జరిగితే మాత్రం తానే స్వయంగా చెబుతాను అంటూ అప్పటివరకు ఎవరూ కూడా ఇలాంటి విషయాలను నమ్మవద్దని తెలియజేసింది రష్మిక. కానీ విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ ను మాత్రం బయటికి చెప్పలేదు.


మొత్తానికి రష్మిక చేసిన కామెంట్స్ చేస్తూ ఉంటే నిజంగానే రష్మిక విజయ్ తో రిలేషన్ లో ఉందన్నట్లుగా తేలిపోతోంది. రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా ఒకవైపు దూసుకుపోతూ ఉండగా విజయ్ దేవరకొండ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులు మాత్రం రష్మిక తో సినిమా చేస్తే కచ్చితంగా విజయ్ కి హిట్ అందుతుందంటూ ధీమా చేస్తున్నారు.వీరిద్దరూ కలిసి ఒక సినిమా త్వరలోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా యావరేజ్ గా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందంట చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: