
అలా కొంతమంది సెలబ్రెటీలను మానసికంగా వేధించడమే కాకుండా వారి నుంచి లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బెదిరింపులు ఉమామహేశ్వర్ మరింత ఎక్కువ చేయడంతో కొంతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించారు. ఈ ఫిర్యాదులో భాగంగా అధికారులు వెంటనే రంగంలోకి దిగి సైలెంట్ గా పూర్తి వివరాలను సేకరించారు. దీంతో ఉమామహేశ్వరరావు చేస్తున్న పని ఏంటో తేలిపోయింది. అతడి ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ అదును చూసుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజాగా అరెస్టు చేయగా అనంతరం విచారణ కొనసాగిస్తున్నారు.. ఉమామహేశ్వరరావు ఒక్కరే ఈ పని చేస్తున్నారా? లేకపోతే మరెవరైనా హస్తం ఉందా అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు కాల్ డేటా, ఫైనాన్షియల్ లావాదేవలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇప్పటివరకు ఉమామహేశ్వరరావు ఎవరేవరి ఇళ్లకు వెళ్ళాడు, ఎవరెవరిని బెదిరించారు, వారి నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారనే అంశాలను వెలికితీస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు. త్వరలోనే అతని పైన పూర్తి వివరాలతో కేసు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయం విన్న నెటిజన్స్ కేవలం ఒక్క కానిస్టేబుల్ సెలబ్రిటీలను బెదిరించారా అంటు ఆశ్చర్యపోతున్నారు.