
బద్రి తర్వాత మహేష్ బాబుతో `నాని`, ఎన్టీఆర్ కు జోడిగా `నరసింహుడు`, బాలకృష్ణ సరసన `పరమ వీర చక్రం` చిత్రాల్లో మెరిసి మాయమైంది. అయితే బాలీవుడ్ లో మాత్రం అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పింది. కానీ తన స్టార్డమ్ ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. కొన్ని హిట్లు వచ్చినా, వరుస ఫ్లాప్‌లు ఆమె కెరీర్‌ను వెనక్కి నెట్టాయి. అదే సమయంలో వ్యక్తిగత జీవితం కూడా ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌ను దెబ్బ తీసింది.

కెరీర్ ఫుల్ జోష్‌లో ఉన్న టైమ్‌లో అమీషా పటేల్ డైరెక్టర్ విక్రమ్ భట్ తో ప్రేమలో పడింది. అప్పటికే అతడికి పెళ్లి జరిగింది. దాంతో విక్రమ్, అమీషాల రిలేషన్ ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ క్రమంలో అమీషా తన ఫ్యామిలీకి కూడా దూరమైంది. కానీ విక్రమ్ తో తన బంధాన్ని నిలుపుకోలేకపోయింది. ఐదేళ్ల రిలేషన్ అనంతరం విక్రమ్ భట్, అమీషా పటేష్ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితో రిలేషన్‌లో ఉన్నప్పటికీ, ఆ బంధం సైతం విఫలమైంది.
ప్రస్తుతం అమీషా పటేల్ ఒంటరి జీవితం గడుపుతోంది. 50 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. కెరీర్ విషయానికి వస్తే.. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత, అమీషా ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పియరెన్సెస్, రియాలిటీ షోల ద్వారా తన ప్రెజెన్స్ కొనసాగించింది. 2013లో ఆమె స్వంతంగా `అమీషా పటేల్ ప్రొడక్షన్స్` అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, ఫోటోషూట్లు, గ్లామర్ పిక్స్‌తో ఫ్యాన్స్‌లో క్రేజ్ కొనసాగిస్తోంది. 2023లో `గదర్ 2`తో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆపై అడపా తడపా చిత్రాల్లో మళ్లీ నటిస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అమీషా షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు మెంటలెక్కిపోతున్నారు. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈ సీనియర్ బ్యూటీ గత్తర్ లేపింది.
