
రాజమౌళి విజయాల గురించి మాట్లాడితే, ఆయనకి తోడుగా నిలిచిన భార్య రమా రాజమౌళి పాత్రను ప్రత్యేకంగా చెప్పక తప్పదు. ఆమె సపోర్ట్ ఆయన కెరీర్‌ను మరింత బలపరిచింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకి రమానే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. అలాగే సినిమాలపై రాజమౌళి అంత ఫోకస్ చేయగలుగుతున్నారంటే అందుకు కారణం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ను రమా తమ భుజాలపై వేసుకోవడం వల్లే. నా ఐడియాస్‌ని మొదట వింటుంది రమానే. ఆమె రియాక్షన్ నాకు చాలా ముఖ్యమని గతంలో రాజమౌళి పలుమార్లు వెల్లడించారు. అంటే రమా కేవలం భార్య మాత్రమే కాదు, జక్కన్నకు క్రియేటివ్ పార్ట్‌నర్ కూడా.
రాజమౌళి సినిమాలకు రమా ఫస్ట్ ఆడియెన్. సినిమాలో హైలెట్స్ ఏంటి, మైనస్‌లు ఏంటి, ఎక్కడ కనెక్ట్ కాలేదో రమా సూటిగా చెప్పేస్తారట. ఆమె నిజాయితీ ఫీడ్‌బ్యాక్ రాజమౌళి డైరెక్షన్‌కి శక్తినిచ్చింది. ఇకపోతే రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలన్ని విజయవంతం అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ రాజమౌళి కెరీర్ లో రమా రాజమౌళికి అస్సలు నచ్చని రెండు సినిమాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.
ఈ రెండు చిత్రాల్లో ఒకటి `యమదొంగ`. ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. యమదొంగ సూపర్ హిట్ అయినప్పటికీ తనకు ఆ సినిమా అస్సలు నచ్చదని రమా తెలిపారు. ఎన్టీఆర్ యాక్టింగ్ అద్భుతంగా ఉండటం వల్లే ఆ సినిమా ఆడిందని రమా పేర్కొన్నారు. అలాగే రాజమౌళి తీసిన చిత్రాల్లో `సై` కూడా రమాకు నచ్చదట. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని.. మార్కెట్‌లో కూడా ఆశించిన స్థాయి విజయం సాధించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.