మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. చిరంజీవి కెరీర్లో కొన్ని సినిమాలు ఓకే అయ్యి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యాక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కి బాగా కలిసి వచ్చిన నిర్మాతలలో అశ్విని దత్ ఒకరు. చిరంజీవి హీరో గా అశ్విని దత్ నిర్మాణంలో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో చూడాలని ఉంది అనే సినిమా వచ్చింది.

మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత వీరి కాంబోలో ఇంద్ర అనే సినిమా వచ్చింది. ఆ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఆఖరుగా వీరిద్దరి కాంబోలో జై చిరంజీవ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఈ మూవీ కి విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే చిరంజీవి హీరో గా అశ్వినీ దత్ నిర్మాతగా ఓ సినిమా ఓకే అయ్యి కొంత భాగం షూటింగ్ అయ్యాక క్యాన్సిల్ అయింది. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఎందుకు క్యాన్సల్ అయింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి హీరో గా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అశ్విని దత్ ఓ సినిమాను ఓకే చేశాడు. దీనికి చెప్పాలని ఉంది అనే టైటిల్ని కూడా ఓకే చేశారు. ఇక అంత ఓకే అయ్యాక ఈ సినిమా షూటింగ్ను కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ను కూడా కొంత భాగం పూర్తి చేశాక కొన్ని కారణాల వల్ల రరామ్ గోపాల్ వర్మసినిమా నుండి తప్పుకున్నాడు. దానితో ఈ సినిమా షూటింగ్ను ఆపేశారు. అలా చిరంజీవి హీరో గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అశ్వినీ దత్ "చెప్పాలని ఉంది" అనే టైటిల్ తో మూవీ ని స్టార్ట్ చేశాడు. కానీ ఆ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యాక ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: