
మిరాయ్ మూవీ విడుదల అయిన 2 వ రోజు నార్త్ అమెరికాలో 564318 డాలర్లను వసూలు చేసింది. దానితో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను విడుదల అయిన 2 వ రోజు వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుబేర సినిమా 340162 డాలర్లను వసూలు చేసే 2 వ స్థానంలో నిలవగా , హిట్ ది థర్డ్ కేస్ మూవీ 333123 డాలర్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో కొనసాగుతుంది. గేమ్ చేంజర్ మూవీ 291159 డాలర్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా 215763 డాలర్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతుంది. ఇలా మీరాయ్ మూవీ నార్త్ అమెరికాలో విడుదల అయిన 2 వ రోజు ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు సినిమాలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.