తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ పాత్రలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మీరాయ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33.99 కోట్ల షేర్ ... 54.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు వారం రోజుల్లో 56.74 కోట్ల షేర్ ... 103 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 19.74 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ వారం రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండవ వారం కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ కనిపించడం లేదు. దానితో రెండవ వారం కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మూడవ వారంలో పవన్ నటించిన ఓజి సినిమా విడుదల కానుంది. దానితో ఓజి సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని , ఒక వేళ ఓజి మూవీ కి గనుక బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: