
తమన్ అద్భుతమైన మాస్ నెంబర్ కంపోజ్ చేశారు. బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నారు. ఈ పాట థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులని ప్రేక్షకులని కట్టిపడేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె కూడా స్టోరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, సి. రాంప్రసాద్ డీవోపీగా వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తుండగా, ఏఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు