
అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత అందరి నోట ఒక్కటే చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన ఒక స్పెషల్ షాట్‌లో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ కనిపించాడని, ఆయన యంగ్ పవన్ లుక్ కోసం దర్శకుడు సుజిత్ ప్రత్యేకంగా క్యాస్ట్ చేశారని ప్రచారం మొదలైంది. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఒక ఫోటోలో కనిపించిన యంగ్ లుక్ నిజంగానే అఖీరా నందనే అని అభిమానులు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు సినిమా యూనిట్ లేదా చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం అభిమానులు ఊహించుకుంటూ సోషల్ మీడియాలో సృష్టించిన బజ్ మాత్రమేనని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. అయినా సరే, పవన్ కళ్యాణ్ కొడుకు నిజంగానే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ రోల్ చేశాడా..? లేదా..? అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
సినిమా హాల్స్‌లో స్క్రీన్‌పై కనుక అఖీరా నందన్ పవన్ కళ్యాణ్ పక్కన కనిపిస్తే, అది పవన్ అభిమానులకు భారీ ఫెస్టివల్ లాంటిదే. ఒకవైపు తండ్రి – మరోవైపు కొడుకు కలిసి కనిపిస్తే అది సినిమా కోసం స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. దీనివల్ల సినిమాకి ప్లస్ పాయింట్ మరింత పెరుగుతుంది అని అభిమానులు అంటున్నారు. కానీ అఖీరా నందన్ అసలు సినిమాలో నటించకపోతే, ఈ రూమర్ వల్ల ఏర్పడిన హైప్ కొంచెం తగ్గిపోవచ్చనే అభిప్రాయం కూడా కొందరిది. మొత్తానికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓ జి” సినిమా ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో, ఈ అఖీరా నందన్ సస్పెన్స్ చర్చ మరింత క్రేజ్‌ను రేపుతోంది. ఇది నిజంగానే డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసిన ఒక బిగ్ సర్ప్రైజ్‌నా లేకపోతే అభిమానులు సృష్టించిన ఓవర్ హైప్‌నా అనేది స్పష్టమవ్వడానికి ఇంకో కొద్ది గంటలే మిగిలాయి.