
అక్కడి వరకు బాగానే ఉన్నా ఇటీవల వస్తోన్న అన్ని సినిమాలు సీక్వెల్ ఉంటున్నట్టు ప్రకటన చేస్తున్నాయి. కానీ ఆ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. పవన్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా సీక్వెల్ ఉందని ప్రకటించారు. కానీ ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. తొలి పార్ట్‌లే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతున్నాయి. అలాంటప్పుడు సీక్వెల్స్ ఎలా వస్తాయో కూడా తెలియట్లేదు. ఇక పవన్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఓజీ సీక్వెల్ కష్టమే. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్‌ను ఇప్పటి నుంచి ఊరించడం మినహా చేసేదేం ఉండకపోవచ్చు.
పవన్ క్యారెక్టర్, స్టోరీ ప్రెజెంటేషన్ సీక్వెల్ లో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటినుంచే పెరిగిపోతోంది. “ఓజీ”లో పవన్ కళ్యాణ్ యాక్షన్, స్టైల్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ గా నిలిచాయి. దర్శకుడు సుజీత్ పవన్ కి తగ్గ కొత్త లుక్, పవర్ ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించడం సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది. థమన్ అందించిన సంగీతం, బీజీఎమ్ యాక్షన్ సీన్స్ కి మరింత హై ఎలివేషన్ ఇచ్చాయి.