పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన ఓజి మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోలు పడిపోయి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది.సినిమా చూసిన చాలామంది థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మొహాలన్నీ వెలిగిపోతూ కనిపించాయి. సినిమా బ్లాక్ బస్టర్..ఎక్స్ట్రాడినరీ..పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్..అంటూ ఎంతోమంది రివ్యూలు ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ అందరూ కలిసి సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా నిర్మాత, డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్కరు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే ఇందులో భాగంగా ఈ సినిమాని నిర్మించిన నిర్మాత డివివి దానయ్య సక్సెస్ మీట్ ఈవెంట్ లో మాట్లాడుతూ..ఓజి సినిమాకి మెయిన్ పిల్లర్ ఆయనే..

ఆయన లేకపోతే అసలు ఓజి సినిమానే లేకపోయేది. మీరు అనుకుంటున్నట్లు ఓజి మూవీ తెరకెక్కడానికి కారణం పవన్ కళ్యాణో లేక సుజితో కాదు.. సినిమా తెరకెక్కడానికి మరో వ్యక్తి కారణమయ్యారు.ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. దర్శకుడు త్రివిక్రమ్ లేకపోతే అసలు ఓజి సినిమా తెరకెక్కేదే కాదు.. ఓజి సినిమా తెరకెక్కడానికి త్రివిక్రమ్ కారణం. కాబట్టి ఈ సినిమా హిట్ క్రెడిట్ ని ఆయనకే ఇవ్వాలి. అందుకే ఆయనకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే త్రివిక్రమ్ లేకపోతే ఓజీ ప్రాజెక్టు చేసే వాళ్లమే కాదు. మొదట త్రివిక్రమ్ దగ్గర పవన్ కళ్యాణ్ సార్ తో మేము ఒక సినిమా చేయాలనుకుంటున్నాము అని చెప్పిన సమయంలో దర్శకుడిగా సుజిత్ ని తీసుకోండి అని సలహా ఇచ్చారు.
అలా సుజిత్ పేరుని త్రివిక్రమ్ చెప్పడంతో ఆ తర్వాత వెంటనే సుజిత్ ని కలిసాము. ఇక సుజిత్ దగ్గరికి వెళ్లడంతో ఓజి మూవీ స్టోరీ చెప్పారు. కథ బలంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్లి స్టోరీ వివరించడంతో ఆయన కూడా ఒకే చెప్పారు. అలా ఓజి మూవీ ఇక్కడి వరకు వచ్చిందంటే దానికి కారణం త్రివిక్రమే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు నిర్మాత డివివి దానయ్య. అలా ఈ సినిమా తెరకెక్కడానికి కారణం త్రివిక్రమ్ అని చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఓజి మూవీ తెరకెక్కించడానికి త్రివిక్రమ్ కారణమైనప్పటికీ ఓజీ మూవీకి సంబంధించిన ఏ ఈవెంట్లో కూడా త్రివిక్రమ్ కనిపించలేదు. బహుశా ఆయన తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్లే ఓజి మూవీ ఈవెంట్స్ కి రాలేకపోయారు కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: