
పేదవారి కోసమే నీ వెబ్సైట్ ఉన్నట్లు వారు ఇండస్ట్రీ వారికి ఇప్పటికే అనేక మెసేజ్లు చేశారు . టికెట్లు రేట్లు తగ్గించిన ఈ సైట్ తమ ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోవడం లేదు . దీంతో సినీ ఇండస్ట్రీ కూడా విసిగిపోయింది . ఇక తాజాగా యూట్యూబ్ కూడా ఈ తరహా లోనే తయారయింది . తాజాగా రిలీజ్ అయినటువంటి ఓజీ మూవీ యూట్యూబ్లో ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అవ్వుతున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ అయింది . ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది .
ఇక తమన్ సంగీతం అందించిన హిమూవీ ప్రజెంట్ థియేటర్లను షేక్ చేస్తుంది . ఒకపక్క థియేటర్లలో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా యూట్యూబ్లో హెచ్డీ ప్రింట్ లో వస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి . ఈ వీడియోలు చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు . ఇక ఇదే కనుక నిజమైతే ఈ మూవీపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు . కలెక్షన్స్ పై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది . మరి ఇది ఎంతవరకు నిజమో మూవీ టీమ్స్ స్పందిస్తేనే కానీ తెలియదు .