ఈ మధ్య కాలం లో మన తెలుగు హీరో లు నటించిన చాలా సినిమాలు పాన్ ఇండియా రేం జ్ లో విడుదల అవు తున్న విషయం మన అందరికి తెలిసిం దే . ఇక సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో అనేక భాషలలో విడు దల చేస్తూ ఉండటంతో ఇతర భాషలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఎంతో మంది నటీ నటులను కూడా మూవీ లలో తీసుకుంటున్నారు . అందు లో భాగంగా ఇప్పటికే మన తెలుగు సినిమాల లో ఎంతో మంది ఇతర భాష స్టార్ నటులు నటించిన సందర్భాలు ఉన్నా యి . తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని , సుజిత్ దర్శకత్వంలో తన తదుపరి మూవీ చేయబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుజిత్ అదిరిపోయే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... నాని సినిమాలో విలన్ పాత్ర కోసం సుజిత్ ఏకంగా మలయాళ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి పృధ్వీరాజ్ సుకుమరన్ ను తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ అన్నీ ఒకే అయ్యి పృథ్విరాజ్ కనుక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తే ఈ మూవీ క్రేజ్ అమాంతం పెరుగుతుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే సలార్ మూవీ లో నటించిన పృధ్విరాజ్ కి ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు , రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అదిరిపోయే రేంజ్ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: