టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ తన జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా శిరీష్ తన నిశ్చితార్థానికి సంబంధించిన శుభవార్తను ప్రకటించారు. ఈ ప్రకటన అల్లు అభిమానులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, కాస్తంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.

అల్లు శిరీష్ చేతిని అందుకోబోతున్న ఆ యువతి పేరు నయానిక. ఆమె పూర్తి పేరు నయనిక రెడ్డి అని తెలుస్తోంది. నయనిక రెడ్డి కుటుంబ నేపథ్యం గురించి చూస్తే, ఆమె తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో స్థిరపడిన వ్యక్తిగా సమాచారం. వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నారని, పరస్పరం ఇష్టపడి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఈ వివాహం ఇరు కుటుంబాల సమ్మతితో జరుగుతున్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి యువతీయువకులు కులాల హద్దులు దాటి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. అల్లు శిరీష్, నయానిక రెడ్డిల వివాహ నిశ్చయం ఈ కోవకే చెందుతుంది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అల్లు శిరీష్  కెరీర్ పరంగా మరిన్ని విజయాలను  సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  అల్లు శిరీష్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.  అల్లు శిరీష్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో  చూడాల్సి ఉంది.  సరైన కథలను ఎంచుకుంటే  అల్లు శిరీష్ కెరీర్ పరంగా  మరిన్ని సంచలనాలను సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.  అల్లు శిరీష్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా  ఉండనున్నాయో  చూడాల్సి ఉంది. అల్లు శిరీష్ ను  అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: