
మంచు విష్ణు నువ్వు కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు . ఇక దీంతో శ్రీకాంత్ స్పందించడం జరిగింది . తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలుపుతూ వీడియో షేర్ చేశాడు . శ్రీకాంత్ మాట్లాడుతూ.. " నేను చేసిన వ్యాఖ్యలతో చాలామంది బాధపడ్డారని తెలిసింది . వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను . స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు వెడవడం జరిగింది . వారందరినీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది .
భవిష్యత్తులో ఇలాంటివి మనల్ని విడదీయకుండా చూసుకుంటాను . మనమంతా కలిసి అభివృద్ధిలో ముందుకు సాగుదాం " అంటూ శ్రీకాంత్ ఒక వీడియోను షేర్ చేశాడు . దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసే లా కనిపిస్తుంది . మరి ఈ క్షమాపణలను అభిమానులు అంగీకరిస్తారో లేదా ఇంకేది అయినా డిమాండ్ చేస్తారో వేచి చూడాలి . ప్రస్తుతానికి అయితే ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి . మరి ఈ చర్చలు ఇక్కడితో ఆగుతాయో లేదో వేచి చూడవలసి ఉంది . ఇక ప్రజెంట్ శ్రీకాంత్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .